Arvind Kejriwal Sisodia : ఆధునిక ప్రహ్లాదుడు సిసోడియా
ఆయన బయటకు రాకుండా ఆపలేరు
Arvind Kejriwal Sisodia : మద్యం స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తతం తీహార్ జైలులో ఉన్న ఆప్ అగ్ర నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. బెయిల్ విచారణకు ముందు ఆయనను పౌరాణిక పాత్రలో పేరొందిన ప్రహ్లాదుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరి పేరు చెప్పకుండానే హిరణ్య కశిపుడు భగవంతుడిని పూజింకుండా ప్రహ్లదుడిని ఆపలేదన్నారు. విచిత్రం ఏమిటంటే మనీష్ సిసోడియాను ఆధునిక ప్రహ్లాదుడితో పోల్చారు సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Sisodia).
ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కుట్రలు పన్నినా సిసోడియాను బయటకు రాకుండా ఆప లేరని పేర్కొన్నారు సీఎం. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. కేవలం బీజేపీయేతర వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆయన బెయిల్ విచారణకు ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి సేవ చేస్తున్న వారిని కటకటాల వెనక్కి నెట్టి వేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు అరవింద్ కేజ్రీవాల్.
శుక్రవారం ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రధానంగా మాజీ తన సహచరుడి గురించి ప్రస్తావించారు. దేశానికి నిస్వార్థంగా సేవలు అందించారు సిసోడియా. అంతే కాదు పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు పరితపించారు. ఆపై ఆరోగ్యం పేదలకు అందేలా చేశారని కితాబు ఇచ్చారు సీఎం(Arvind Kejriwal).
అప్పట్లో ఆ ప్రహ్లాదుడిని ఎవరూ ఆపలేదు. నేటి ఆధునిక యుగంలో సిసోడియాను కూడా రాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపింది.
Also Read : రాకేశ్ టికాయత్ కు బెదిరింపు కాల్