Mallikarjun Kharge : ప్రజాస్వామ్యానికి పాతర మోదీ జాతర
నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
Mallikarjun Kharge Modi : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ఇతర పక్షాలతో కలిసి. రాహుల్ గాంధీని కేంద్ర సర్కార్ టార్గెట్ చేయడాన్ని తప్పు పట్టారు. తమ నాయకుడు అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఉన్న ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారని మోదీ ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం బీజేపీయేతర పార్టీలను , రాష్ట్రాలను, నాయకులను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇలాంటి చౌకబారు చర్యలకు స్వస్తి పలకాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఎల్లకాలం ఉండదన్నారు. ఎవరు శాశ్వతం కాదని పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge Modi). బీఆర్ఎస్ , లెఫ్ట్ పార్టీలు, ఆప్ తో కలిసి ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో కలిసి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ నుండి విజయ్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సార్లు విదేశాల్లో భారత దేశం గురించి చులకనగా మారారని ఆరోపించారు ఖర్గే. ప్రజాస్వామ్యాన్ని అణిచి వేస్తున్న వాళ్లు దాని రక్షణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఏఐసీసీ చీఫ్. భారత డెమోక్రసీ క్రూరమైన దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందంటూ ఇటీవల లండన్ లో రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదన్నారు. కేవలం అదానీ , హిండెన్ బర్గ్ వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే ఇలా విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు ఖర్గే(Mallikarjun Kharge).
Also Read : రాహుల్ పై భగ్గుమన్న రాజ్ నాథ్