CM KCR Congratulate : పాటకు దక్కిన గౌరవం అద్భుతం
ప్రశంసలతో ముంచెత్తిన సీఎం కేసీఆర్
CM KCR Congratulate : విశ్వ వేదిక మీద ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ దక్కడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఆర్ఆర్ఆర్ టీఎంను అభినందించారు. తెలుగు వారి ఘన కీర్తి ఈ పాటకు దక్కిన గౌరవంతో మరింత ఇనుమడింప చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతితో పాటు తెలుగు వారి అభిరుచి ఇందులో మేళవించడం ప్రశంసనీయమని కితాబు ఇచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ను , స్వర పరిచిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని, నటించిన జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ను, పాడిన రాహుల్ సిప్లి గంజ్ , కాల భైరవను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
స్వతహాగా ఉద్యమకారుడు, నాయకుడు, సాహిత్య పిపాసిగా ఉన్న కేసీఆర్ కు(CM KCR Congratulate) పాటలంటే ఇష్టం. ఆయన స్వతహాగా గాయకుడు కూడా. ఇవాళ పాటకు పట్టాభిషేకం కట్టడం దేశానికి తెలుగు వారికి గర్వ కారణమని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఇక నాటు నాటు పాటలో పొందు పర్చిన పదాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయని కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో తెలుగు వారి సాంప్రదాయం కూడా ఇందులో మిళితం చేయడం తనను ఆనంద పరిచిందన్నారు కేసీఆర్.
తెలుగు భాష లోని మట్టి వాసనలను, ఘాటును నాటు నాటు పాట ద్వారా వెలుగులోకి తెచ్చిన గేయ రచయిత జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె కు చెందిన చంద్రబోస్ ను అభినందించారు.
Also Read : ఇది గర్వించ దగిన క్షణం – ఆలియా