Janasena Formation Day : జనసేన ఆవిర్భావ సభ
బందరు శివారులో ప్రాంగణం
Janasena Formation Day : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మార్చి 14న జరగనుంది. బందరు శివారులో 35 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లలో మునిగి పోయింది. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చే జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఏడాది 2024లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయినా ఇప్పటి నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపిక చేసింది సభను నిర్వహించేందుకు జనసేన పార్టీ(Janasena Formation Day). ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తను స్వంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనం వారాహిలో ఇక్కడికి చేరుకుంటారు.
సభా స్థలంలో 1,20,000 మందికి పైగా కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ సభ కనిపించేలా భారీ ఎత్తున ఎల్ఇడి స్క్రీన్లు కూడా అందుబాటులో ఉంచారు. సభ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే వారందరికీ ఉచితంగా నీళ్లు, మజ్జిగ, వైద్య సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా ఎలాంటి ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు. అలా చేస్తే చర్యలు తప్పవన్నారు.
Also Read : జనసేన ప్రస్థానం ప్రభంజనం