Satya Pal Malik : నాకేమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్
JK Satya Pal Malik : జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ కింద భద్రత ఉండేదని కానీ ఇప్పుడు దానిని కూడా తీసి వేసినట్లు తెలిసిందన్నారు. ఈ సమయంలో తనకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik). తనకు ఉన్న వ్యక్తిగత భద్రతా అధికారి గత మూడు రోజులుగా కనిపించడం లేదన్నారు.
గతంలో తాను కీలక వ్యాఖ్యలు చేశానని , ఈ సమయంలో తనను టార్గెట్ చేసే ఛాన్స్ ఉందన్నారు సత్య పాల్ మాలిక్. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదా రద్దు సమయంలో ఆయన జమ్మూ కాశ్మీర్ కు గవర్నర్ గా ఉన్నారు. జెడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించుకున్న తర్వాత కేంద్రంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
జెడ్ ప్లస్ లో తనకు ఇక నుంచి ఎలైట్ కమాండోల రక్షణ ఉండదని పోలీసు ప్రధాన కార్యాలయం నుండి తెలుసుకున్నానని , ఇది భారత దేశంలోని ఒక నాయకుడికి ఉండే అత్యుత్తమ భద్రతలో ఒకటి అని పేర్కొన్నారు మాజీ గవర్నర్. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని మునుపటి గవర్నర్ లందరికీ మంచి భద్రత ఉందన్నారు.
నాకు ఏదైనా జరిగితే దానికి కేంద్ర సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేను జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీని మాత్రమే రద్దు చేశాను. ఆర్టికల్ 370 ప్రకారం నా పదవీ కాలంలో తొలగించ బడిందన్నారు. విచిత్రం ఏమిటంటే సత్య పాల్ మాలిక్(JK Satya Pal Malik) భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు.
Also Read : ఆస్కార్ అవార్డుల క్రెడిట్ తీసుకోవద్దు – ఖర్గే