Bandi Sanjay : సమయం ఇస్తే 18న హాజరవుతా
మహిళా కమిషన్ కు బండి లేఖ
Bandi Sanjay Mahila Summons : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నోరు పారేసుకున్నందుకు గాను బీజేపీ స్టేట్ చీఫ్ , ఎంపీ బండి సంజయ్ పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరిస్తున్నామని వెంటనే సంజాయిషీ ఇవ్వాలని , ఆఫీసుకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.
దీనిపై మంగళవారం ఎంపీ బండి సంజయ్ స్పందించారు. తాను ఇప్పుడు బిజీగా ఉన్నానని, ప్రస్తుతం దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయని , హాజరు కావాల్సి ఉన్నందున కమిషన్ ఇచ్చిన నోటీసుకు తాను వివరణ ఇవ్వలేనన్నారు.
తాను అన్నదాంట్లో తప్పేమీ లేదన్నారు బండి సంజయ్. ఇదిలా ఉండగా కావాలని వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కు చెందిన దిష్టి బొమ్మలను ధ్వంసం చేశారు.
రాజ్ భవన్ వద్దకు భారీగా తరలి వచ్చారు. ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అంబేద్కర్ విగ్రహానికి తమ విన్నపాన్ని అందజేశారు. వెంటనే ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో నిన్నటి దాకా మౌనంగా ఉన్న మహిళా కమిషన్ జూలు విదిల్చింది. ఎంపీకి షాక్ ఇచ్చింది.
మహిళపై నోరు పారేసుకుంటే ఎలా అని వివరణ ఇస్తే కుదరదని , స్వయంగా కమిషన్ వద్దకు(Bandi Sanjay Mahila Summons) రావాలని ఆదేశించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంపీ స్పందించారు. తనకు 18న సెలవు ఉంటుందని ఆరోజు సమయం ఇస్తే వస్తానని పేర్కొన్నారు . పర్మిషన్ వస్తే వస్తానని వెల్లడించారు.
Also Read : 15న మహిళా బిల్లుపై కవిత సమావేశం