Bandi Sanjay TSPSC : టీఎస్పీఎస్సీ చైర్మన్ పై విచారణ చేపట్టాలి
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై బీఎస్పీ, బీజేవైఎం, తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు టీఎస్ పీఎస్సీ బోర్డును కూడా తొలగించారు. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం స్పందించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
దీనికి ప్రధాన కారకుడు సర్వీస్ కమిషన్ జనార్దన్ రెడ్డి అని మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్ పీఎస్సీ పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు.
చైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ కావడానికి వీలు లేదన్నారు. రూల్స్ ప్రకారం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ కూడా ఉంటుందని ఏం జరిగిందనే దానిపై వివరణ ఇవ్వాల్సింది ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు బీజేపీ చీఫ్(Bandi Sanjay TSPSC) .
పోలీసులు చెప్పే దానికి పొంతన లేకుండా పోయిందన్నారు. కార్యదర్శి పీఏ కు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ముందు టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు ఇతర సభ్యులను, కార్యదర్శిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ . తెలంగాణలో ఉద్యోగాలను భర్తీ చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్ కు లేదన్నారు బీజేపీ చీఫ్. గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Also Read : సమయం ఇస్తే 18న హాజరవుతా