AP CM YS Jagan : పనితీరే ముఖ్యం లేకపోతే కష్టం
మంత్రులకు సీఎం జగన్ హితబోధ
CM YS Jagan Budget 2023 : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రసంగించారు. అనంతరం మంత్రివర్గంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం. త్వరలోనే ఎన్నికలు ఉన్నాయన్న సంగతి మరిచి పోవద్దన్నారు. ప్రతి ఒక్కరు తమ పనితీరుకు సంబంధించి టార్గెట్ ను రీచ్ కావాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరికీ గ్రేడింగ్ అనేది ఉంటుందన్నారు. ఆయా గ్రేడింగ్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే భవిష్యత్తులో పదవులు కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం(CM YS Jagan Budget 2023). ఇక నుంచైనా తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఎవరి పేర్లను ఉద్దేశించి అనలేదు కానీ మంత్రులపై మాత్రం షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. మరో వైపు ఏపీలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏపీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి.
దేశంలోనే ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమదేనని అందుకే వాటిని మరింత ప్రజల్లోకి తెలిసేలా చేయాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని మరోసారి కుండ బద్దలు కొట్టారు. కాగా ఇటీవల విశాఖలో గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని , దీనిని ఘనంగా నిర్వహించేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను ప్రత్యేకంగా అభినందించారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). జూలై నుంచి విశాఖ నుంచే పాలన సాగుతుందని స్పష్టం చేశారు సీఎం.
Also Read : ఆవిర్భావ సభకు జనసేనాని