Revanth Reddy : సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాలి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్

Revanth Reddy TSPSC Leak : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) పేప‌ర్ లీక్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాద‌యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి, కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్ కు తెలియ‌కుండా ఎలా ప‌రీక్షా పేప‌ర్లు లీక్ అవుతాయ‌ని ప్ర‌శ్నించారు.

అత్యంత కాన్ఫిడెన్స్ గా ఉండాల్సిన పేప‌ర్లు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయో చెప్పాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేదా అని నిల‌దీశారు. గ‌తంలో ఇంట‌ర్ పేప‌ర్ లీకేజీ అయి విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని, ఇవాళ ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు జాబ్స్ భ‌ర్తీ అవుతాయ‌ని ఆశ‌తో ఉన్నార‌ని వారంద‌రి క‌ల‌ల‌పై , ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy TSPSC Leak).

క‌ల్వకుంట్ల కుటుంబంతో స‌న్నిహితంగా ఉన్న వాళ్లే లీకులు, స్కాంల‌కు పాల్ప‌డుతున్నారంటూ మండిప‌డ్డారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ప‌రీక్ష‌, సింగ‌రేణి లో జాబ్స్ కు సంబంధించిన ప‌రీక్ష‌ల‌లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఇందులో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల పాత్ర ఉంద‌న్నారు.

అస‌లు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఎస్ పీఎస్సీ పేప‌ర్ల లీకుపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాల‌ని రేవంత్ రెడ్డి(Revanth Reddy) డిమాండ్ చేశారు. గ‌తంలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌పై కూడా విచార‌ణ చేప‌ట్టాల‌న్నారు. ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు రేవంత్ రెడ్డి.

Also Read : టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ పై విచార‌ణ చేప‌ట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!