Russian Jet Dumps : యుఎస్ డ్రోన్ ను కూల్చేసిన ర‌ష్యా

ఇంధ‌నం డంప్ చేసి ఢీకొట్టింది

Russian Jet Dumps : అమెరికా ర‌ష్యా మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ర‌ష్యాకు చెందిన జెట్ యుఎస్ కు చెందిన డ్రోన్ పై ఇంధ‌నాన్ని డంప్ చేసి ఢీకొట్టింది. ఇదే విష‌యాన్ని అమెరికా ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌డం విశేషం. రెండు ర‌ష్య‌న్ ఎస్ యు -27 యుద్ద మాన‌వ ర‌హిత ఎంక్యూ-9 రీప‌ర్ ను అంత‌ర్జాతీయ జ‌లాల‌పై అడ్డ‌గించాయ‌ని పేర్కొంది. ఒక దాని ప్రొపెల్ల‌ర్ ను క్లిఫ్ చేసింద‌ని యుఎస్ యూరోపియ‌న్ క‌మాండ్ తెలిపింది. ర‌ష్యా చేసిన ప‌నికి రండు విమానాలు కూలి పోయేందుకు(Russian Jet Dumps) కార‌ణ‌మైంద‌ని ఆరోపించింది.

న‌ల్ల స‌ముద్రం మీదుగా అమెరికా డ్రోన్ పై ర‌ష్యా ఫైట‌ర్ జెట్ ఇంధ‌నాన్ని పోసి ఆపై దానిని ఢీ కొట్ట‌డంతో డ్రోన్ కూలి పోయింద‌ని పేర్కొంది. రెండు ర‌ష్ న్ ఎస్ యు 27 యుద్ద విమానాలు మాన‌వ ర‌హిత ఎంక్యూ -9 రీప‌ర్ ను అంత‌ర్జాతీయ జ‌లాల‌ను అడ్డ‌గించాయ‌ని , ఇందులో ఒక దానిలోని ప్రొపెల్ల‌ర్ ను క్లిప్ చేసింద‌ని యుఎస్ యూరోపియ‌న్ క‌మాండ్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

ఢీకొనేందుకు ముందు చాలా సార్లు ఎస్ యు – 27లు ఇంధ‌నాన్ని డంప్ చేసి ఎంక్యూ -9 ముందు నిర్ల‌క్ష్యంగా ప‌ర్యావ‌ర‌ణానికి హానిక‌రం, వృత్తికి విరుద్ద‌మ‌ని ఆరోపించింది. అయితే యుఎస్ ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించింది ర‌ష్యా. ఇది సాధార‌ణ ఐఎస్ఆర్ (ఇంటెలిజెన్స్ ,నిఘా ) మిష‌న్ లో ఉంద‌ని పెంట‌గాన్ తెలిపింది.

ఇదిలా ఉండ‌గా నిర‌స‌న తెలిపేందుకు ర‌ష్యా రాయ‌బారిని పిలిపించిన‌ట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ఈ విష‌యంపై సీరియ‌స్ గా స్పందించారు వైట్ హౌస్ జాతీయ భ‌ద్ర‌తా ప్ర‌తినిధి జాన్ కిర్బీ.

Also Read : న‌న్ను చంపాల‌ని చూస్తున్నారు

Leave A Reply

Your Email Id will not be published!