Opposition March : విపక్షాల ఆందోళన ఉద్రిక్తం
దేశ రాజధానిలో పరిస్థితి ఉద్రిక్తం
Opposition March : అదానీ హిండెన్ బర్గ్ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అదానీపై ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. పార్లమెంట్ లో దేశం పట్ల అగౌరవంగా మాట్లాడారని, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రలు డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తమ నాయకుడు అన్న దాంట్లో తప్పేమీ లేదని, ప్రస్తుతం దేశంలో మోదీ రాచరిక పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేశాడంటూ ఆరోపించారు. ముందు పీఎం నరేంద్ర మోదీకి అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో దేశానికి చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.
అదానీ , హిండెన్ బర్గ్ వివాదంపై విచారణ చేపట్టాలని కోరుతూ బుధవారం అన్ని పార్టీలు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు పాదయాత్రగా బయలు దేరేందుకు ప్రయత్నం చేశారు(Opposition March). పోలీసులు వారిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదానీ అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ 18 ప్రతిపక్ష పార్టీల నేతలు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
పోలీసులు అడ్డు కోవడంతో ఎంపీలు పార్లమెంట్ కు తిరిగి వచ్చారు. తాము ఈడీతో అపాయింట్ మెంట్ కోరామని త్వరలో సంయుక్త ఫిర్యాదు లేఖను విడుదల చేస్తామన్నారు. తాము 200 మందిమి ఉన్నాం..కానీ ఇక్కడ పోలీసులు 2,000 వేల మంది ఉన్నారు.. మా గొంతును అణిచి వేస్తున్నారంటూ ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.
Also Read : స్మృతీ ఇరానీపై సుప్రియా సీరియస్