Dinesh Karthik IPL : రోహిత్, కోహ్లీలకు అంత సీన్ లేదు.. దినేశ్ కార్తీక్ కామెంట్స్

Dinesh Karthik IPL : ఇక ఐపీఎల్ ఆరంభానికి ముందు భారత వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమిండియాలో ప్రస్తుతం అత్యుత్తమ ఆటగాడు ఎవరో చెప్పేశాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కాదని మరో ప్లేయర్ ను దినేశ్ కార్తీక్ ఎంపిక చేయడం విశేషం.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసింది. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి బాధతో ఐపీఎల్ 2023 కోసం టీమిండియా ప్లేయర్లు విడిపోయారు. ప్రస్తుతం భారత ప్లేయర్లు వారి వారి ఫ్రాంచైజీల గూటికి చేరుకున్నారు.

ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న ఘనంగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుంది. మొన్నటి వరకు మిత్రులుగా దేశం కోసం ఆడిన ప్లేయర్స్.. ఇప్పుడు ఫ్రాంచైజీ కోసం శుత్రువులుగా పోరాడనున్నారు.

ఇక ఐపీఎల్ ఆరంభానికి ముందు భారత వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర (Dinesh Karthik IPL) కామెంట్స్ చేశాడు. టీమిండియాలో ప్రస్తుతం అత్యుత్తమ ఆటగాడు ఎవరో చెప్పేశాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కాదని మరో ప్లేయర్ ను దినేశ్ కార్తీక్ ఎంపిక చేయడం విశేషం.

ప్రస్తుతం టీమిండియాలో హార్దిక్ పాండ్యా కీలక ప్లేయర్ అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా ఉంటే జట్టులో ఇద్దరు ప్లేయర్లు ఉన్నట్లే అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. పేసర్ గా ఉంటూ బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా ఉండటం చాలా కష్టమని కార్తీక్ వ్యాఖ్యానించాడు.

షార్ట్ పిచ్ బంతులతో హార్దిక్ పాండ్యా వికెట్లను రాబట్టడం చాలా అద్భుతంగా ఉంటుందని డీకే వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా హార్దిక్ బౌలింగ్ కు రాగానే బ్యాటర్లు బ్యాక్ ఫుట్ పై ఆడతారని కార్తీక్ పేర్కొన్నాడు. దాంతో హార్ధిక్ బౌలింగ్ లో పరుగులు చేయడం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టంగా మారుతుందని వ్యాఖ్యానించాడు.

ఇక అకస్మాత్తుగా అతడు వేసే బౌన్సర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఆలోచనలో పడేస్తాయని తెలిపాడు. షాట్ ఆడాలో తెలియక వికెట్లను పారేసుకుంటున్నారని కార్తీక్ పేర్కొన్నాడు. టీమిండియాలో జడేజా, అక్షర్ పటేల్ ల రూపంలో స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నా.. తన ఓటు మాత్రం హార్దిక్ పాండ్యాకే అంటూ వ్యాఖ్యానించాడు.

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టి20 ఫార్మాట్ లో టీమిండియాకు నాయకుడిగా ఉన్నాడు. 2024 టి20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే భారత జట్టు సిద్ధమవుతోంది. ఇక ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు నాయకుడిగా ఉన్న హార్దిక్ తొలి సీజన్ లోనే తన జట్టును చాంపియన్ గా నిలబెట్టాడు.

ఈ ఏడాది కూడా అదే దూకుడును ప్రదర్శించి ఐపీఎల్ టైటిల్(IPL) ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మార్చి 31న జరిగే ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

Also Read : ప్రాణాలనే రిస్క్ చేసిన విండీస్ ప్లేయర్ .. వీడియో వైరల్

Leave A Reply

Your Email Id will not be published!