GT vs CSK IPL : చెన్నై కి హ్యాండిచ్చిన బౌలర్.. ఇక కష్టమే!
GT vs CSK IPL : ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్ (న్యూజిలాండ్) గాయం కారణంగా టీమ్‌కి దూరమైపోయాడు. దాంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికాకి చెందిన ఆల్‌రౌండర్ సిసండ మంగళని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. కానీ తాజాగా భారత్‌కి చెందిన ఫాస్ట్ బౌలర్ ముకేష్ చౌదరి (Mukesh Choudhary) గాయంతో చెన్నై టీమ్‌కి దూరమైపోయాడు.
రంజీల్లో ఆడుతూ గత ఏడాది చివర్లో గాయపడిన ముకేష్ చౌదరి.. ఈ మూడు నెలలు ఫిట్‌నెస్ సాధించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జనవరి నుంచి ఒక్క మ్యాచ్‌లో కూడా అతను ఆడలేదు. కానీ.. చెన్నై సూపర్ కింగ్స్(GT vs CSK IPL) నెట్స్‌లో బౌలింగ్ చేసిన ముకేష్ చౌదరి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి ముకేష్ చౌదరి దూరమైపోయాడు. అతని స్థానంలో ఇంకా ఎవరినీ జట్టులోకి చెన్నై తీసుకోలేదు.
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.20 లక్షలకి ముకేష్ చౌదరిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. గత ఏడాది 13 మ్యాచ్‌లాడిన ఈ ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ 16 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అతను బౌలింగ్ ఎకానమీ 9.32గా ఉండగా.. బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 4/46. గత ఏడాది డిసెంబరులో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆఖరిగా ముకేష్ చౌదరి బౌలింగ్ చేశాడు.
ముకేష్ చౌదరి టీమ్‌కి దూరమవడంతో తుషార్ దేశ్‌పాండేకి తుది జట్టులో ఎక్కువగా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ.. అతనికి టీ20ల్లో చాలినంత అనుభవం లేదు. దాంతో చెన్నై టీమ్‌కి ఈ సీజన్‌లో కష్టమే.
Also Read : ఐపీఎల్ టోర్నీ ఆల్-టైమ్ రికార్డులు ఇవే..