Shikhar Dhawan : శిఖర్ ధావన్ ధనా ధన్
పంజాబ్ గెలుపులో కీలక పాత్ర
Shikhar Dhawan : గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ ఎనిమిదో లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒకానొక దశలో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అనిపించింది. కానీ సామ్ కరన్ అత్యంత తెలివిగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు శాంసన్ సేనకు.
స్కిప్పర్ సంజూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తప్పని తేలి పోయింది. బ్యాటింగ్ పిచ్ మీద ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఉంటే సీన్ వేరేగా ఉండేది. కానీ చివరి బంతి దాకా రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు ప్రదర్శించిన పోరాట పటిమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఓడి పోయినా క్రికెట్ అభిమానుల మనసు మాత్రం గెలుచుకున్నారు. ఫుల్ ఫామ్ లో ఉన్న షిమ్రోన్ హిట్మెయర్ గనుక రనౌట్ కాక పోయి ఉండి ఉంటే సీన్ వేరేగా ఉండేది.
అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ రాజస్థాన్ ముందుంచింది. ప్రారంభం నుంచే దూకుడు పెంచాడు స్కిప్పర్ శిఖర్ ధావన్. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 9 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
కెప్టెన్ ధావన్(Shikhar Dhawan) తో పాటు ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా రెచ్చి పోయాడు. కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొని 60 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఆఖరులో వచ్చిన జితేశ్ శర్మ 16 బంతుల్లో 27 రన్స్ చేయడంతో పంజాబ్ బిగ్ స్కోర్ చేయగలిగింది.
Also Read : ఉత్కంఠ పోరులో పంజాబ్ విక్టరీ