Rajasthan Royals IPL 2023 : కోట్లాది అభిమానులకు కనువిందు చేసింది రాజస్థాన్ రాయల్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన ఎనిమిదో లీగ్ మ్యాచ్. పరుగుల వరద పారింది. తొలిసారిగా గౌహతి స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. మరో వైపు కళ్లు చెదిరే షాట్స్ తో ఇరు జట్ల ప్లేయర్లు అలరించారు. మరో వైపు నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బౌలర్లు చుక్కలు చూపించారు.
పొట్టి ఫార్మాట్ కు ఉన్న పవర్ ఏమిటో మరోసారి చాటి చెప్పింది ఈ లీగ్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఇంకో జట్టు అయితే తడబడి ఉండేది. కానీ 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సంజూ శాంసన్ సేన ఏ మాత్రం తల వంచలేదు. ఓ వైపు టాప్ ఆర్డర్ కుప్ప కూలినా ఎక్కడా తగ్గలేదు. విజయం కోసం చివరి బంతి దాకా పోరాడింది.
శ్రీలంక మాజీ కెప్టెన్ , మిస్టర్ కూల్ గా పేరొందిన రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్(Rajasthan Royals IPL 2023) , చీఫ్ హెడ్ కుమార సంగక్కర దిశా నిర్దేశంలో ఆ జట్టు ఎలా పోరాడాలో నేర్చుకుంది. ఒక రకంగా పంజాబ్ కు చుక్కలు చూపించింది.
ఒకవేళ ఆఖరులో స్టార్ హిట్టర్ , విండీస్ క్రికెటర్ షిమ్రోన్ హిట్మెయర్ గనుక రనౌట్ కాక పోయి ఉంటే సీన్ వేరేలాగా ఉండేది. ఇప్పటి దాకా ఎనిమిది మ్యాచ్ లు పూర్తయినా ఇంతలా ఉత్కంఠను ఏ మ్యాచ్ కలిగించలేదు. కానీ రాజస్థాన్ ఓడినా ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంది.
Also Read : నిప్పులు చెరిగిన నాథన్ ఎల్లిస్