Pope Francis : శృంగారం దేవుడిచ్చిన వరం – పోప్
డాక్యుమెంటరీలో ఫ్రాన్సిస్ కామెంట్స్
Pope Francis : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా భావించే వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్స్ అన్నది పాపమని, అది కేవలం నాలుగు గోడల మధ్యకే పరిమితం కావాలని పేర్కొంటూ ఉన్న వారికి దిమ్మ తిరిగేలా సంచలన కామెంట్స్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
సెక్స్ (శృంగారం) అనేది అద్భుతమని, అది దేవుడు మానవ జాతికి ఇచ్చిన వరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ డాక్యుమెంటరీస్ లో వెల్లడించడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవుడు మానవునికి ఇచ్చిన అందమైన వాటిలో సెక్స్ కూడా ఒకటి అని స్పష్టం చేశారు. ఇదొక్కటే కాదు జీవితానికి సంబంధించిన అన్ని అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
86 ఏళ్ల పాంటీఫ్ డిస్నీ ప్రొడక్షన్ ది పోప్ ఆన్సర్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు పోప్ ఫ్రాన్సిస్. ఇది 20 ఏళ్ల ప్రారంభంలో 10 మంది వ్యక్తులతో రోమ్ లో గత ఏడది జరిగిన సమావేశాన్ని కవర్ చేసింది. ఎల్జీబీటీ హక్కులు, అబార్షన్ , అశ్లీల పరిశ్రమ, సెక్స్ , కాథలిక్ చర్చిలో విశ్వాసం , లైంగిక వేధింపులతో సహా పలు అంశాలపై పోప్ ను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఆయన పై విధంగా సెక్స్ తప్పు కాదని అదో అందమైన విషయంగా స్పష్టం చేశారు.
Also Read : కఠినంగా ఉన్నా కరిగి పోయా – ఇమ్నా