Temjen Imna Along : క‌ఠినంగా ఉన్నా క‌రిగి పోయా – ఇమ్నా

సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Temjen Imna Along : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. సోష‌ల్ మీడియాలో నిత్యం బిజీగా ఉండే ఇమ్నా తాజాగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.

గ‌త కొంత కాలంగా బీజేపీలో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా మారి పోయారు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. నిత్యం ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకుంటారు. అంతే కాదు స్పూర్తి దాయ‌కంగా ఉండేలా సూక్తులు కూడా తెలియ చేస్తూ ఉంటారు. త‌న అనుచ‌రుల‌ను అల‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తారు నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along).

చ‌మ‌త్కార‌మైన పోస్ట్ ల‌కు పెట్టింది పేరు. అమ్మాయిల స‌మూహంతో నిల‌బ‌డి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఇప్ప‌టికే వేలాది మంది ఈ ఫోటోను లైక్ చేశారు. మ‌రికొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. వారితో క‌లిసి న‌వ్వుతూ ఉండ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఒక్క ఫోటో ఎంద‌రినో ఆక‌ట్టుకుంది. ఏకంగా 2 ల‌క్ష‌ల‌కు పైగా వీక్షించారు. 15 వేల‌కు పైగా లైక్ లు కూడా రావ‌డం విశేషం.

జీవితంలో ఎప్పుడూ న‌వ్వుతూ ఉండాల‌ని అనుకుంటాను. నేను చాలా క‌ఠిన‌మైన వ్య‌క్తిని అయిన‌ప్ప‌టికీ వీరిని చూసి క‌రిగి పోయాన‌ని పేర్కొన్నారు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్.

Also Read : చైనా వ‌ర్త‌మానాన్ని చెరిపేస్తోంది – ఓవైసీ

Leave A Reply

Your Email Id will not be published!