Asaduddin Owaisi : చైనా వ‌ర్త‌మానాన్ని చెరిపేస్తోంది – ఓవైసీ

మొఘ‌ల్ చ‌రిత్ర తొలగింపుపై ఆగ్ర‌హం

Asaduddin Owaisi : ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బుధ‌వారం కేంద్ర స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్సీఆర్టీకి సంబంధించి 12వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కాల‌లో నాలుగు పాఠ్యాంశాల‌ను తొల‌గించింది. అందులో మొఘ‌ల్ చ‌రిత్ర‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఓవైసీ(Asaduddin Owaisi). మోదీ ప్ర‌భుత్వం మొఘ‌ల్ చ‌రిత్ర‌ను తొల‌గిస్తోంది. ఇదే స‌మ‌యంలో చైనా వ‌ర్త‌మానాన్ని చెరిపేస్తోందంటూ ఎద్దేవా చేశారు .

ఏ ప్రాతిప‌దిక‌న తొల‌గించారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మీరు పాఠ్య పుస్త‌కాల‌లో చ‌రిత్ర‌ను తొల‌గించ‌గ‌ల‌రు. కానీ చ‌రిత్ర‌ను పూర్తిగా నిర్మూలించ లేర‌న్న విష‌యం తెలుసు కోవాల‌న్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు వ్య‌తిరేకంగా 11 ప్రాంతాల‌కు చైనా పేరు పెడితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏం చేస్తున్నారంటూ ఓవైసీ ప్ర‌శ్నించారు.

ఓ వైపు మోడీ దెబ్బ‌కు ఎన్సీఆర్టీ పాఠ్యాంశాల‌లో త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న వాటిని తొల‌గించుకుంటూ పోతోంది. కానీ ఇదే స‌మ‌యంలో చైనా దెబ్బ‌కు ప్ర‌ధాని భ‌య‌ప‌డుతున్నారు. ఎక్క‌డా డ్రాగ‌న్ త‌గ్గ‌డం లేదు. భార‌త దేశానికి చెందిన భూభాగాన్ని ఆక్ర‌మించుకుంటూ పోతోంది. ఇంత‌కూ ఆయ‌న పీఎంగా ఉన్న‌ట్టా లేన‌ట్టా అని అనుమానం వ్య‌క్తం చేశారు అస‌దుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi).

ఇలా ఎంత కాలం దాచి పెడ‌తారంటూ ప్ర‌శ్నించారు. ఇవాళ మీరు చ‌రిత్ర‌ను చెరిపేస్తే రేపు ప్ర‌జ‌లు మీ చ‌రిత్ర లేకుండా చేస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రాజ్య‌స‌భ ఎంపీ క‌పిల్ సిబ‌ల్.

Also Read : రాహుల్ పై సింధియా ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!