KKR vs RCB IPL 2023 : కోల్‌కతా భళా బెంగళూరు విలవిల
బౌలర్ల దెబ్బకు ఠారెత్తిన బ్యాటర్లు
KKR vs RCB IPL 2023 : కోల్ కతా జూలు విదిల్చింది. ముంబై ఇండియన్స్ ను ఓడించి ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోల్ కతా నైట్ రైడర్స్. స్పిన్నర్ల దెబ్బకు బెంగళూరు బ్యాటర్లు క్యూ కట్టారు. ఏకంగా 81 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.
తమ స్వంత గడ్డ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వేలాది మంది అభిమానుల మధ్య కోల్ కతా నైట్ రైడర్స్ రెచ్చి పోయారు. ఓ వైపు వికెట్లు కూలినా ఎక్కడా తగ్గలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. భారీ లక్ష్య సాధనలో ఆర్సీబీ చతికిల పడింది.
మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన కోల్ కతా ఎట్టకేలకు ఐపీఎల్ లీగ్ లో బోణీ కొట్టింది. కోల్ కతాకు(KKR vs RCB IPL 2023) చెందిన స్పీన్నర్లు చుక్కలు చూపించారు. వరుణ్ చక్రవర్తి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ సుయాశ్ శర్మ 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక విండీస్ బౌలర్ సునీల్ సరైన్ 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 21 రన్స్ చేస్తే , డుప్లెసిస్ 23 , డేవిడ్ విల్లీ 20, బ్రేస్ వెల్ 19 పరుగులు మాత్రమే చేశారు. ఇక మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చివరకు 123 పరుగులకే ఆర్సీబీ చాప చుట్టేసింది. విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read : రాజస్థాన్ ఓటమికి కెప్టెన్..కోచ్ కారణం