DK Shivakumar : కర్ణాటకలో రాబోయే కాలం మాదే
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కామెంట్స్
DK Shivakumar : కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే మే నెల 10న పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి పోయింది. ప్రస్తుతం కన్నడ నాట సీఎం బస్వరాజ్ బొమ్మై సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం బొమ్మై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలుమార్లు పర్యటించారు. భారీగా నిధులు కేటాయించారు. ఈ తరుణంలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కేపీసీసీ చీఫ్.
శనివారం ప్రముఖ రాజకీయ నాయకుడు డి. ఆర్. ఎల్. జాలప్ప కుమారుడు దొడ్డ బళ్లా పూర్ మాజీ ఎమ్మెల్యే జే నరసింహ్మ స్వామి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు డీకే శివకుమార్. ఆయనకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు కేపీసీసీ చీఫ్. ఇదిలా ఉండగా 130 సీట్లకు పైగా తమ పార్టీకి వస్తాయని అన్నారు మాజీ సీఎం సిద్దరామయ్య. ఇదే సమయంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం కాంగ్రెస్ కే ఛాన్స్ ఉంటుందన్నారు.
Also Read : కన్నడ నాట కాంగ్రెస్ కే ఛాన్స్ – పవార్