Sharad Pawar : క‌న్న‌డ నాట కాంగ్రెస్ కే ఛాన్స్ – ప‌వార్

అధికారంలోకి రానుంద‌ని అంచ‌నా

ఎన్సీపీ చీఫ్ , మాజీ కేంద్ర మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మే నెల‌లో క‌ర్ణాట‌క‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి విజ‌యం సాధించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని జోష్యం చెప్పారు. ఆ ఎన్నిక‌ల‌ను జాతీయ ఎన్నిక‌ల కోణంలో చూడ‌లేమ‌న్నారు. అయితే బీజేపీ త‌న ప్ర‌చారంలో జాతీయ అంశాల‌తో రాష్ట్ర స‌మ‌స్య‌ల‌తో ముడిప‌డి ఉంద‌న్నారు శ‌ర‌ద్ ప‌వార్.

ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకే విజ‌యావ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌తో వీటిని పోల్చ లేమ‌న్నారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఏపీ బీజేపీ ప్ర‌భుత్వాలు కావు. క‌ర్ణాట‌క‌లో ప‌రిస్థితి భిన్నంగా ఉంద‌న్నారు. త‌మిళ‌నాడులో ప‌రిస్థితి ఆ పార్టీకి అనుకూలంగా లేద‌ని డీఎంకేకు అక్క‌డ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని అన్నారు.

ఒక‌వేళ యెడ్డీ గ‌నుక కంటిన్యూగా కొన‌సాగి ఉంటే కొంత ఇబ్బంది ఏర్ప‌డి ఉండేది క‌ర్ణాట‌క‌లో అని పేర్కొన్నారు శ‌ర‌ద్ ప‌వార్. ఆయ‌న‌ను పూర్తి కాలం పాటు ఉంచ‌క పోవ‌డం ఆ పార్టీ కి పెద్ద దెబ్బ అన్నారు. ఇక క‌ర్ణాట‌క‌లో రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌తో పాటు రాష్ట్ర పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లో చైత‌న్య‌వంతం చేయ‌డం ఒక సానుకూలంగా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఎన్సీపీ చీఫ్‌.

Leave A Reply

Your Email Id will not be published!