CM Yogi Comment : అతడంటే హడల్ నేరస్థుల గుండె గుభేల్
నేరస్థుల పాలిట యోగి సింహ స్వప్నం
CM Yogi Comment : యూపీలో ఎప్పుడైతే యోగి ఆదిత్యానాథ్ సీఎంగా కొలువు తీరారో ఆనాటి నుంచి బుల్ డోజర్లు రంగంలోకి దిగాయి. అంతేనా పేరు మోసిన గ్యాంగ్ స్టర్లు, కరడు గట్టిన నేరగాళ్లు, మాఫియా డాన్ లకు చుక్కలు చూపించడం ప్రారంభించాడు.
ప్రధానంగా ఏ పార్టీకి చెందిన వారైనా సరే, వారు ఏ స్థాయిలో ఉన్నా సరే వదిలేది లేదని ప్రకటించారు. అంతేనా అసెంబ్లీ సాక్షిగా ప్యాంట్లు తడిసేలా చేస్తానని సంచలన ప్రకటన చేశాడు. తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాడు యోగి ఆదిత్యానాథ్(CM Yogi Comment).
సమాజ్ వాదీ పార్టీకి చెందిన అతిక్ అహ్మద్ కు చుక్కలు చూపించాడు. అతడిపై 100 కేసులు నమోదైనా ఇప్పటి వరకు జైలుకు వెళ్లలేదు. కానీ బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో అహ్మద్ ను జైలుకు పంపించాడు యోగి ఆదిత్యానాథ్. ఒకానొక దశలో తనను చంపేస్తారంటూ వాపోయేలా చేశాడు సీఎం. పేరు మోసిన నేరస్థుల జాబితా తెప్పించుకున్నాడు.
ఎవరైనా ఎదురు తిరిగితే కాల్చి పారేయమంటూ ఆర్డర్స్ ఇచ్చాడు. దెబ్బకు గ్యాంగ్ స్టర్లు కాళ్ల బేరానికి వచ్చారు. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడంటూ ఆరోపణలు వచ్చినా లెక్క చేయలేదు ఈ సీఎం.
ఒకటా రెండా ఏకంగా యూపీలో పేరు మోసిన నేరస్థులకు చెందిన రూ. 1,128 కోట్ల అక్రమ ఆస్తులను జప్తు చేయించాడు. ఏకంగా 5, 558 కేసులు నమోదు చేశారు. సీఎం ఫుల్ పవర్స్ ఇవ్వడంతో పోలీసులు తమ దూకుడు పెంచారు. కనిపించిన వారినంతా తోసేశారు. పీడీ యాక్టు కూడా పెట్టారు.
మరికొందరు స్వచ్చంధంగా లొంగి పోయారు. తమను చంపవద్దంటూ కోరారు. ఇందులో 25 మంది కరడుగట్టిన నేరస్థులను కేంద్ర హోం శాఖకు అప్పగించారు. కనీసం 22,259 మంది సహచరులపై కేసులు నమోదు చేశారంటే సీఎం ఎంత కచ్చితంగా ఉన్నారో అర్థం అవుతుంది.
వీరిలో భయంకరమైన గ్యాంగ్ స్టర్లు అతిక్ అహ్మద్ , ముఖ్తార్ అన్సారీలీతో పాటు కనీసం 25 మాఫియాలకు చెందిన ఆస్తులను జప్తు చేశారు. గ్యాంగ్ స్టర్ చట్టం తీసుకు వచ్చింది యోగి సర్కార్. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ అగ్రస్థానంలో ఉండడం విశేషం.
గుజరాత్ లోని సబర్మతి జైలులో ఉన్నాడు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యతో సహా 100 కు పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు అతడి ముఠాలోని 90 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఆయుధాల లైసెన్సులు కూడా రద్దు చేశారు. అన్సారీకి చెందిన రూ. 179 కోట్ల విలువైన ఆస్తులను కూల్చి వేసింది ప్రభుత్వం. ఆయనకు చెందిన 158 మంది అనుచరులను అరెస్ట్ చేశారు. 122 మంది సహాయకుల ఆయుధాల లైసెన్సులు రద్దు చేశారు.
అంతేకాకుండా, ప్రస్తుతం సోన్‌భద్ర జైలులో ఉన్న సుందర్ భాటి ముఠాలోని 9 మంది సభ్యుల రూ.63.24 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా, అప్రసిద్ధ ధృవ్ కుమార్ అలియాస్ కుంటు సింగ్ గ్యాంగ్‌లోని 43 మంది నేరస్థులను యుపి పోలీసులు అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం అజంగఢ్‌లోని బల్లియా జైలులో ఉన్నారు.
దాదాపు రూ.18 కోట్ల విలువైన ఈ ముఠా ఆస్తులను సీజ్ చేశారు. మొత్తంగా గ్యాంగ్ స్టర్లు, నేరస్థులు లేని యూపీ రాష్ట్రంగా చేయడమే తన అంతిమ లక్ష్యమని ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Comment). ఆయన పేరు చెబితే ప్యాంట్లు తడిసి పోతున్నాయి. ఎంతైనా సీఎం మజాకా కదూ.
Also Read : తైవాన్ ను చుట్టు ముట్టిన చైనా