Shubman Gill : శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డ్
2 వేల పరుగులు దాటిన క్రికెటర్
Shubman Gill : పొట్టి ఫార్మాట్ ఐపీఎల్ లో పరుగుల వరద పారుతోంది. యువ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. తమదైన రీతిలో రాణిస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. నువ్వా నేనా అంటూ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. ఒకే రోజులో 409 పరుగులు చేశాయి ఇరు జట్లు.
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 204 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ దుమ్ము రేపింది. భారీ టార్గెట్ ను నమ్మ శక్యం కాని రీతిలో ఛేదించింది. గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సైతం విస్తు పోయాడు. ఫ్యాన్స్ కు మంచి మజా లభించింది. నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ , రింకూ సింగ్ దుమ్ము రేపారు. చివరి ఓవర్ యశ్ దయాల్ బౌలింగ్ లో ఏకంగా 5 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ లో అరుదైన రికార్డు సృష్టించాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ కు చెందిన యువ ప్లేయర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ కెరీర్ లో 2,000 పరుగులు పూర్తి చేశాడు. ఓపెనర్ గా వచ్చిన గిల్ 5 ఫోర్లతో 39 రన్స్ చేశాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన 48వ క్రికెటర్ గా నిలిచాడు. అంతే కాదు 200 బౌండరీలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు గిల్(Shubman Gill) .
Also Read : బెంగళూరు లక్నో పోరుకు సిద్ధం