Delhi HC Vivek Agnihotri : వివేక్ అగ్నిహోత్రిపై కోర్టు సీరియస్
ఆనంద్ రంగనాథన్ పై కూడా ఆగ్రహం
Delhi HC Vivek Agnihotri : సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం అలవాటుగా మారిందని సీరియస్ కామెంట్స్ చేసింది ఢిల్లీ కోర్టు. ఒక రకంగా ట్విటర్ చాలా కష్టాలకు మూలంగా తయారైందని పేర్కొంది. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి తో పాటు ఆనంద్ రంగనాథణ్ లపై కోర్టు ధిక్కార కేసులో సోమవారం తీర్పు వెలువరించింది ఢిల్లీ హైకోర్టు(Delhi HC Vivek Agnihotri).
వివేక్ అగ్నిహోత్రి కోర్టులో హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో కోర్టు క్షమించి వదిలి వేసింది. ఇంకోసారి ఇలాంటి చవకబారు ప్రకటనలు, లేదా విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించింది. న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం లేని వాళ్లు ఎలా సినిమాలు తీస్తారంటూ, ఎలాంటి సందేశాలు ప్రజలకు అందిస్తారంటూ ప్రశ్నించింది కోర్టు.
ఇదే సమయంలో ఆదిత్య రంగనాథన్ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ స్పష్టం చేసింది ధర్మాసనం. ప్రముఖ హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు బెయిల్ మంజూరు చేసినందుకు జస్టిస్ మురళీధర్ పై పలువురు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు.
దీనిపై న్యాయమూర్తులు సిద్దార్థ్ మృదుల్ , వికాస్ మహాజనల్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ట్విటర్ లో అభ్యంతరకరమైన ప్రకటన చేసినందుకు అగ్నిహోత్రి క్షమాపణ చెప్పడాన్ని స్వాగతించింది. న్యాయ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు.
Also Read : తలైవాతో దిల్ రాజు సినిమా