MI vs DC IPL 2023 : బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
రాణించిన రిషబ్ పంత్..తిలక్ వర్మ
MI vs DC IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస అపజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్(MI vs DC IPL 2023) కంటిన్యూ అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సత్తా చాటాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కీలక పోరులో భారీ స్కోర్ ను ఛేదించింది ముంబై. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది రోహిత్ సేన. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో సుదీర్ఘ కాలం తర్వాత 22 ఇన్నింగ్స్ ల అనంతరం 41వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
తిలక్ వర్మ 41 రన్స్ చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి బంతి దాకా ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. రోహిత్, వర్మతో పాటు ఇతర క్రికెటర్లు కూడా తమదైన ముద్ర కనబరిచారు. మ్యాచ్ విషయానికొస్తే ముందు బ్యాటింగ్ చేసింది డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ . నిర్ణీత 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది.
ఒక రకంగా భారీ స్కోర్. ఐపీఎల్ లో 51 పరుగులతో మరోసారి రాణించాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా సత్తా చాటాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎప్పటి లాగే పృథ్వీ షా నిరాశ పరిచాడు. యష్ దుల్ 2, పావెల్ 4, యాదవ్ 2 రన్స్ తో పెవిలియన్ చేరాడు.
Also Read : వార్నర్ మెరిసినా ఢిల్లీ సేమ్ సీన్