Jos Butler Record : జోస్ బ‌ట్ల‌ర్ అరుదైన రికార్డ్

ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు

Jos Butler Record : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చెన్నై సూప‌ర్ కింగ్స్ పై గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. వ‌ర‌ల్డ్ క్రికెట్ స్టార్ జోస్ బ‌ట్ల‌ర్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. త‌న ఐపీఎల్ కెరీర్ లో 3,000 ర‌న్స్ పూర్తి చేశాడు. వ‌రుస‌గా స‌త్తా చాటుతూ వ‌స్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది మ్యాచ్.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆది లోనే య‌శ‌స్వి జైశ్వాల్ వికెట్ ను కోల్పోయింది. 10 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ తో క‌లిసి జోస్ బ‌ట్ల‌ర్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ప‌డిక్క‌ల్ 38 ర‌న్స్ చేస్తే జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler Record) 52 ర‌న్స్ తో మెరిశాడు. అనంత‌రం వ‌చ్చిన శాంస‌న్ నిరాశ ప‌రిస్తే ర‌విచంద్ర‌న్ అశ్విన్ 30 ప‌రుగుల‌తో ఆదుకోవ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 175 ప‌రుగులు చేసింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ చివ‌రి బంతి వ‌ర‌కు పోరాడింది. ప్ర‌ధానంగా సీఎస్కే కెప్టెన్ జార్ఖండ్ డైన‌మెంట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ , ర‌వీంద్ర జ‌డేజాతో క‌లిసి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. మ్యాచ్ గెలుస్తుంద‌ని అనుకున్నారు. కానీ శ‌ర్మ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో రాజస్థాన్ చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Also Read : రాజ‌స్థాన్ సెన్సేష‌న్ చెన్నై ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!