Sandeep Sharma : రాజస్థాన్ సీమర్ మ్యాచ్ విన్నర్
అద్భుతమైన బంతులతో పరేషాన్
Sandeep Sharma : ఐపీఎల్ 16వ సీజన్ లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది రాజస్థాన్ రాయల్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 175 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కంగ్స్ ఛేదనలో బోల్తా పడింది. 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఒక రకంగా చెన్నై గెలుస్తుందని అంతా భావించారు. కానీ రాజస్థాన్ స్కిప్పర్ సంజూ శాంసన్ తెలివిగా పంజాబ్ సీమర్ సందీప్ శర్మ(Sandeep Sharma) కు ఛాన్స్ ఇచ్చాడు.
శాంసన్ అంచనాలు తప్పలేదు. సందీప్ శర్మ మ్యాచ్ విన్నర్ గా మారాడు. ఆఖరి ఓవర్ లో చెన్నై గెలవాలంటే 21 పరుగులు కావాలి. క్రీజులో ఉన్నది ఎవరో కాదు అపారమైన అనుభవం కలిగిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అప్పటికే 17 బంతులు ఆడి 32 రన్స్ చేశాడు. కళ్లు చెదిరే సిక్సర్లు, ఫోర్లతో దుమ్ము రేపాడు.
అతడికి తోడుగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 బంతులు ఆడి 25 రన్స్ చేశాడు. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది. ధోనీ, జడేజాలు మ్యాచ్ విజయంపై మరింత ఆసక్తిన పెంచారు.
కానీ వారి అంచనాలు తప్పాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ(Sandeep Sharma) చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. ధోనీ, జడేజాలు ఇద్దరూ పరుగులు చేయలేక చతికిల పడ్డారు. లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు సందీప్ శర్మ. ఇక రాజస్థాన్ బౌలింగ్ కోచ్ గా ఉన్న శ్రీలంక మాజీ క్రికెటర్ మలింగ పెదవులపై చిరునవ్వు మెరిసింది.
Also Read : ఐపీఎల్ లో ధావన్..చాహల్ టాప్