Supreme Court Slams : ల‌లిత్ మోడీపై సుప్రీం సీరియ‌స్

కామెంట్స్ పై క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే

Supreme Court Slams : భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ వ్య‌వ‌స్థాపకుడు, మాజీ చైర్మ‌న్ అయిన ల‌లిత్ మోడీ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం లండ‌న్ లో సేద దీరారు. ఇండియాకు రాకుండా అక్క‌డే ఉంటూ కార్య‌క‌లాపాల‌లో మునిగి తేలుతున్నారు. ఇటీవ‌లే సుష్మితా సేన్ తో ప్రేమ‌లో కూడా ప‌డిన‌ట్లు ఫోటోలు కూడా షేర్ చేశాడు.

ఇది ప‌క్క‌న పెడితే సుప్రీంకోర్టు(Supreme Court Slams) తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది ల‌లిత్ మోడీపై. బేష‌ర‌తుగా కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆదేశించింది. సోష‌ల్ మీడియాతో పాటు ప్ర‌ముఖ జాతీయ వార్తా ప‌త్రిక‌ల్లో కూడా సారీ చెప్పాల‌ని స్ప‌ష్టం చేసింది. న్యాయ వ్య‌వ‌స్థ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ల‌లిత్ మోడీపై మండిప‌డింది సుప్రీంకోర్టు.

ల‌లిత్ మోడీ చ‌ట్టానికి అతీతుడు కాద‌ని, అంతే కాదు సంస్థ‌కు కూడా కాద‌ని పేర్కొంది. ల‌లిత్ మోడీకి(Lalit Modi) సంబంధించిన కేసుపై విచార‌ణ చేప‌ట్టారు న్యాయ‌మూర్తులు ఎంఆర్ షా, సీటీ ర‌వికుమార్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం. ఈ సంద‌ర్బంగా ల‌లిత్ మోడీ దాఖ‌లు చేసిన కౌంట‌ర్ అఫిడ‌విట్ తో సంతృప్తి చెంద‌లేని తెలిపింది.

క్ష‌మాప‌ణ‌లు చెప్పే ముందు అఫిడ‌విట్ ను దాఖ‌లు చేయాల‌ని, భ‌విష్య‌త్తులో అలాంటి పోస్ట్ లు చేయ‌రాద‌ని హెచ్చ‌రించింది. భారతీయ న్యాయ వ్య‌వ‌స్థ ప్ర‌తిష్ట‌ను ఎవ‌రు భంగం క‌లిగించాల‌ని ప్ర‌య‌త్నం చేసినా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

Also Read : గుజ‌రాత్ పంజాబ్ బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!