Vyshak Vijayakumar : వైశాఖ్ మ్యాజిక్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ షాక్

4 ఓవ‌ర్లు 20 ప‌రుగులు 3 వికెట్లు

Vyshak Vijayakumar : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించేలా అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు వైశాఖ్ విజ‌య కుమార్(Vaishak Vijayakumar). బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న మొద‌టి మ్యాచ్ లోనే క‌ళ్లు చెదిరే బంతులతో హోరెత్తించాడు. 4 ఓవ‌ర్లు వేసిన వైశాఖ్ కేవ‌లం 20 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు కీల‌క‌మైన విక‌ట్లు ప‌డ‌గొట్టాడు. ఆర్సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 175 ర‌న్స్ చేసింది. కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే మాక్స్ వెల్ మెరిశాడు. అనంత‌రం 176 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌలింగ్ దెబ్బ‌కు చ‌తికిల ప‌డింది. కేవ‌లం 151 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. దీంతో 23 ప‌రుగుల‌తో వ‌రుస‌గా 5వ మ్యాచ్ లో ప‌రాజ‌యం పాలైంది.

ఇక తొలి మ్యాచ్ లోనే వైశాఖ్ విజ‌య కుమార్ హీరోగా మారాడు. 32 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. వైశాఖ్ తొలి ఓవ‌ర్ లోనే నాలుగో బంతికి కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ వికెట్ తీశాడు. త‌ర్వాతి ఓవ‌ర్ లో ఫామ్ లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ ను , ల‌లిత్ యాద‌వ్ ల‌ను పెవిలియ‌న్ కు పంపించాడు. మొత్తంగా ఆర్సీబీ గెలుపులో హీరోగా మారాడు వైశాఖ్(Vyshak Vijayakumar).

Also Read : ఢిల్లీ ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం

Leave A Reply

Your Email Id will not be published!