Sikandar Raza : సిఖందర్ రజా షాన్ దార్
జోర్దార్ ఇన్నింగ్స్ తో షాక్
Sikandar Raza : పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ కొట్టిన దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. కీలక పోరులో పంజాబ్ ను గెలుపు తీరాలకు చేర్చారు ఆ జట్టుకు చెందిన సిఖందర్ రజా(Sikandar Raza), షారుఖ్ ఖాన్. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో ధావన్ స్థానంలో శామ్ కరన్ స్కిప్పర్ గా వ్యవహరించాడు.
టాస్ గెలిచిన శామ్ కరన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతడి వ్యూహం వర్కవుట్ అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఎక్కువ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసి విజయం సాధించింది.
ఈ విజయంలో సికిందర్ రజా కీలక పాత్ర పోషించాడు. అతడు 41 బంతులు ఆడి 4 ఫోర్లు 3 సిక్స్ లతో 57 రన్స్ చేశాడు. మరో పంజాబ్ ఆటగాడు షారుక్ ఖాన్ 10 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 23 రన్స్ చేశాడు. షార్ట్ 34 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక లక్నో జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ భారీ స్కోర్ చేసినా తన జట్టును గెలిపించ లేక పోయాడు. ఆ జట్టు హెడ్ కోచ్ , బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. పంజాబ్ కు ఇది మూడో విజయం కావడం విశేషం.
Also Read : ఈసారైనా సంజూ శాంసన్ రాణించేనా