Koko Da Doll : హక్కుల కార్యకర్త రషీదా కాల్చివేత
డాక్యుమెంటరీ స్టార్ గా గుర్తింపు
Koko Da Doll : అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదు. గన్ కల్చర్ ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా ఆగడం లేదు. తాజాగా ఆంధ్రా విద్యార్థి సాయిష్ వీర కాల్చి చంపిన ఘటన మరిచి పోక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డాక్యుమెంటరీ స్టార్ , హక్కుల నాయకురాలిగా గుర్తింపు పొందారు రషీదా విలియమ్స్. ఆమె కాల్చి చంపబడ్డారు.
బాధితురాలి వయస్సు 35 ఏళ్లు. నల్లజాతి లింగ మార్పిడి మహిళలకు సంబంధించిన సమస్యలపై గళం విప్పారు. వారి తరపున ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. ఒక రకంగా పోరాటాలకు ప్రసిద్ది చెందిన ఆమెను కోల్పోవడం బాధకరమని హక్కుల కార్యకర్తలు వాపోయారు. ఇదిలా ఉండగా 2022లో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చెందిన కనీసం 38 మంది మరణించారని ఎల్జీబీటీ హక్కుల సంఘం పేర్కొంది. సంచలన ఆరోపణలు చేసింది.
అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ కోకోమో సిటీలో కనిపించారు. లింగ మార్పిడి హక్కుల కార్యకర్తగా ఆమెకు మరో పేరు కూడా ఉంది. అదే కోకో డా డాల్(Koko Da Doll) అని పిలుస్తారు. ఆమెను మంగళవారం అమెరికాలో కాల్చి చంపబడ్డారని పోలీసులు వెల్లడించారు. బుధవారం యుఎస్ రాష్ట్రం జార్జియా రాజధాని అట్లాంటా లోని ఒక షాపింగ్ మాల్ పక్కన పుట్ పాత్ లో రషీదా విలియమ్స్ మృత దేహం కనుగొన్నట్లు తెలిపారు.
కొకోమో సిటీ డాక్యుమెంటరీలో ముఖ్య పాత్ర పోషించింది ఆమె. గాయకుడు, పాటల రచయిత , నిర్మాత డి స్మిత్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నలుగురు ట్రాన్స్ సెక్స్ వర్కర్ల చుట్టూ తిరుగుతుంది.
Also Read : భారత దేశంలో మీడియా సూపర్ – లూ