LSG vs GT IPL 2023 : ఆదుకున్న పాండ్యా..సాహా
లక్నో ముందు స్వల్ప టార్గెట్
LSG vs GT IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక పోరులో కేఎల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ధాటికి గుజరాత్ టైటాన్స్ విల విల లాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్(LSG vs GT IPL 2023) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది.
లక్నో బౌలర్లు చుక్కలు చూపించారు. అద్బుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. గుజరాత్ బ్యాటర్లను గడ గడ లాడించారు. ఒకానొక దశలో 100 పరుగులు కూడా దాటవన్న అనుమానం కలిగింది. కానీ వృద్దిమాన్ సాహా 37 బంతుల్లో 47 రన్స్ చేశాడు. గుజరాత్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బాల్స్ ఎదుర్కొన్న పాండ్యా 66 పరుగులు చేశాడు. జట్టును ఆదుకున్నాడు. నిజమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ తో అలరించాడు.
వికెట్లు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ లక్నో బౌలర్ల ధాటికి తట్టుకోలేక పోయారు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అభినవ్ ముకుంద్ 5 బంతులు ఎదుర్కొని 3 , విజయ్ శంకర్ 12 బంతుల్లో 10 రన్స్ , డేవిడ్ మిల్లర్ 12 బంతుల్లో 6 పరుగులు చేశాడు. రాహుల్ తివాటియా 2 బాల్స్ లో 2 రన్స్ మాత్రమే చేశాడు.
ఇక లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్యా దుమ్ము రేపాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలక వికెట్లు తీశాడు.
Also Read : ఆ కెప్టెన్లకు ఐపీఎల్ రూల్స్ బెడద