Arshdeep Singh PBSK : అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ మ్యాజిక్
4 ఓవర్లు 29 పరుగులు 4 వికెట్లు
Arshdeep Singh PBSK : ఐపీఎల్ లీగ్ లో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గెలుపు అంచుల్లో ఉన్న ముంబై ఇండియన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యంగా బరిలోకి దిగింది.
ఆఖరి ఓవర్ వరకు టెన్షన్ నెలకొంది. 20వ ఓవర్ లో గెలవాలంటే ముంబైకి 16 పరుగులు కావాలి. డెత్ బౌలర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతే కాదు కీలకమైన 2 వికెట్లు కూల్చాడు. దీంతో 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు భారీ విజయం దక్కింది. తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అర్ష్ దీప్ సింగ్.
అంతే కాదు సూపర్ బౌలింగ్ తో ముంబై బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. సింగ్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. 4 ఓవర్లు మాత్రమే వేసిన అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh PBSK) 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 కీలక వికెట్లు తీసుకుని ఔరా అనిపించేలా చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ కు ఈ గెలుపు ఊరటనిచ్చేలా చేసింది.
Also Read : సత్తా చాటిన కెప్టెన్ సామ్ కరన్