Arjun Tendulkar : నిన్న హీరో నేడు జీరో
ఒకే ఓవర్ 31 రన్స్
Arjun Tendulkar : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లో రికార్డులు బద్దలవుతున్నాయి. కొందరు హీరోలుగా చెలామణి అవుతే మరికొందరు అరుదైన ఘనత సాధిస్తున్నారు. ఇక ఐపీఎల్ లో ఎప్పుడు హీరో అవుతారో ఎప్పుడు జీరో అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
తాజాగా ముంబై ఇండియన్స్ కు చెందిన సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన డెత్ ఓవర్ లో వికెట్ తీశాడు. తక్కువ పరుగులు ఇచ్చి ప్రశంసలు అందుకున్నాడు. వైరల్ కూడా అయ్యాడు.
ఇదే సమయంలో ఏప్రిల్ 22 శనివారం ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 16వ ఓవర్ లో ఏకంగా 31 రన్స్ ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 214 పరుగులు చేసింది. చివరకు ముంబై 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో పంజాబ్ స్కిప్పర్ సామ్ కరన్ , హర్ ప్రీత్ సింగ్ దంచి కొట్టారు . కరణ్ ఒక సిక్స్ , ఒక ఫోర్ , హర్ ప్రీత్ మూడు ఫోర్లు , ఓ సిక్సర్ తో చుక్కలు చూపించారు. పూర్తిగా బౌలింగ్ పై పట్టు కోల్పోయాడు. అంతే కాదు ఓవర్ లో ఒక నో బాల్ కూడా వేశాడు. దీంతో అర్జున్ టెండూల్కర్ పై విమర్శల వర్షం కురిపించారు.
Also Read : కేఎల్ రాహుల్ తెలివి లేనోడు