ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో రాజస్థాన్ బొక్క బోర్లా పడింది. ఈ లీగ్ లో అత్యుద్భతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఛేదనలో చేతులెత్తేసింది. బెంగళూరు బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. అనవసరమైన షాట్ కొట్టేందుకు ప్రయత్నం చేసిన సంజూ శాంసన్ ఈ ఓటమికి బాధ్యత వహించక తప్పదు.
మరోసారి స్టార్ ఫినిషర్ గా పేరు పొందిన షిమ్రోన్ హిట్మెయర్ తీవ్ర నిరాశ పరిచాడు. 9 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరంభంలోనే దెబ్బ కొట్టాడు. జోస్ బట్లర్ ను అద్బుతమైన బంతికి వికెట్లను కూల్చాడు.
ఈ తరుణంలో యంగ్ బ్యాటర్స్ యశస్వి జైశ్వాల్ , దేవదత్ పడిక్కల్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 7 పరుగుల తేడాతో ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. ఇప్పటి దాకా ఇరు జట్ల మధ్య 29 మ్యాచ్ లు జరగగా ఆర్సీబీకి 14వ విజయం. పాయింట్ల పట్టికలో బెంగళూరు 5వ స్థానంలో నిలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.
