Harshal Patel : హ‌ర్ష‌ల్ ప‌టేల్ హ‌ల్ చ‌ల్

రాజ‌స్థాన్ కు బిగ్ షాక్

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో గెలుపు అంచుల దాకా వ‌చ్చి బోల్తా ప‌డింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 189 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 182 ప‌రుగులు చేసింది. స్టార్ హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ను సిరాజ్ అద్భుత‌మైన స్పెల్ కు బోల్తా కొట్టించాడు.

ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా బ‌రిలోకి దిగిన హ‌ర్ష‌ల్ ప‌టేల్ అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. సూప‌ర్ ఇన్నింగ్స్ తో దంచి కొడుతున్న స‌మ‌యంలో య‌శ‌స్వి జైశ్వాల్ ను బోల్తా కొట్టించాడు. అనంత‌రం ఫుల్ ఫామ్ లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ ను పెవిలియ‌న్ పంపించాడు.

ఇక 19వ ఓవ‌ర్ లో సిరాజ్ ను తీసుకు వ‌చ్చాడు ఆర్సీబీ కెప్టెన్. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆఖ‌రి 20వ ఓవ‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేశాడు. 20 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. 2 వైడ్స్ వ‌చ్చాయి. ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ధ్రువ‌ల్ ను బోల్తా కొట్టించాడు. దీంతో 7 ర‌న్స్ తో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. ఈ విజ‌యంతో ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్సీబీ 5వ స్థానానికి చేరుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!