ఐపీఎల్ 16వ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. ఆ జట్టుకు చెందిన శివమ్ దూబే, అజింక్యా రహానే దంచి కొట్టారు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకానొక దశలో వీరి దూకుడుకు 250 పరుగులు చెన్నై జట్టు చేస్తుందని అనుకున్నారు. పరుగుల వరద పారించారు.
236 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ బొక్క బోర్లా పడింది. పాయింట్ల పట్టికలో సీఎస్కే టాప్ లోకి చేరింది. అజింక్యా రహానే కేవలం 29 బంతులు ఎదుర్కొని 71 రన్స్ చేశాడు. తుఫాన్ ఇన్నింగ్స్ తో దంచి కొట్టాడు. చెన్నై ఓపెనర్ డేవిన్ కాన్వే , శివమ్ దూబే సైతం దుమ్ము రేపారు. కోల్ కతా జట్టుపై ఇప్పటి దాకా రెండు జట్లు అత్యధిక స్కోర్ ను నమోదు చేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ పరుగుల వరద పారించాయి.
ప్రారంభం నుంచే రన్స్ చేయడం ప్రారంభించారు కాన్వే, రుతురాజ్. 20 బాల్స్ ఎదుర్కొని రుతురాజ్ 35 రన్స్ చేశాడు. డేవిడ్ కాన్వే 40 బంతుల్లో 56 రన్స్ చేసి శుభారంభాన్ని ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే దంచి కొట్టడం స్టార్ట్ చేశాడు. అజింక్యా రహానేతో కలిసి 32 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూబే 21 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 50 రన్స్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి రహానే మారథాన్ ఇన్నింగ్స్ చేశాడు. 13 బంతుల్లో 38 రన్స్ చేశారు. అజింక్యా రహానే 29 బంతుల్లో 71 రన్స్ చేసి చివరి వరకు ఉన్నాడు.
