హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ , రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్ల మధ్య సోమవారం రాత్రి 7.30 గంటలకు కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్ లు ఆడింది. 2 మ్యాచ్ లు ఓడి పోయి 4 మ్యాచ్ లలో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్ లు 3 మ్యాచ్ లలో విజయం సాధించి 3 మ్యాచ్ లలో పరాజయం పాలైంది.
ఇక పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ రెండో ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక లక్నో 3వ స్థానంతో సరిపెట్టుకుంటే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ 4వ స్థానంలో నిలిచింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోంది గుజరాత్. కేవలం తక్కువ స్కోర్ కే పరిమితమైనా ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ను మట్టి కరిపించింది.
ఆ జట్టు ఈ గెలుపుతో మంచి ఊపు మీదుంది. ఆల్ రౌండర్ షో పాండ్యా చేస్తుండగా నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ ఆఫ్గాన్ బౌలర్లు ఇప్పుడు ఆ జట్టుకు కీలకంగా మారారు. ఇక ముంబై ఇండియన్స్ హైదరాబాద్ కు చుక్కలు చూపించింది. మొత్తంగా ఇవాళ జరిగే కీలక పోరులో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు ఎవరు చేరుతారనేది తేలాల్సి ఉంది.