రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవని వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. ఇందుకు సంబంధించి జంతర్ మంతర్ లో మరోసారి ఆందోళన చేపట్టిన రెజ్లర్ల సమస్యను ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ప్రశ్నించింది. లైంగిక వేధింపుల కేసులో గుర్తింపును అణించి వేసేందుకు జ్యుడీషియల్ రికార్డుల నుండి ఫిర్యాదు చేసిన ఏడుగురు రెజ్లర్ల పేర్లను తగ్గించాలని కోర్టు ఆదేశించింది.
రెజ్లర్లు రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ పై ఆరోపణలు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని మండిపడింది ఢిల్లీ పోలీసులపై. ఇదిలా ఉండగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు రెజ్లర్లు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 28న విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.
అంతర్జాతీయ క్రీడలలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు తమపై లైంగిక వేధింపుల గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వదద్ నిరసన తెలిపిన రెజ్లర్లు ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేంత దాకా తాము నిరసన స్థలంలోనే ఉంటామని స్పష్టం చేశారు. చాలా రోజుల కిందట తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని ఆరోపించారు.