భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్ కు సంబంధించి భారత జట్టును ఇవాళ ప్రకటించింది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న అజింక్యా రహానేకు ఊహించని రీతిలో చోటు దక్కింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాడు ఈ క్రికెటర్.
అంతే కాదు ఎవరూ ఊహించని రీతిలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ లో దంచి కొడుతున్నాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక జట్టు పరంగా చూస్తే రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేసింది. హిట్ మ్యాన్ లోని భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ను జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఆస్ట్రేలియాతో తలపడనుంది.
జట్టుకు సంబంధించి 15 మందిని ఎంపిక చేసింది బీసీసీఐ. అనుకోకుండా శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతడి స్థానంలో అజింక్యా రహానేను ఎంపిక చేసినట్లు తెలిపింది. గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు. ఇక బౌలర్ల పరంగా చూస్తే సిరాజ్ , షమీ, ఉమేష్ యాదవ్ , జయదేవ్ ఉనాద్కత్ , శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.
వీరితో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ , అక్షర్ పటేల్ కు ఛాన్స్ ఇచ్చింది. సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టింది. రోహిత్ తో పాటు గిల్ , పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ కు అవకాశం దక్కింది.