గత కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న అజింక్యా రహానేకు అనూహ్యంగా లక్ వరించింది. తాజాగా బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. తక్కువ బంతుల్లో కళ్లు చెదిరే షాట్స్ తో అలరిస్తున్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని షాట్స్ తో దుమ్ము రేపుతున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో కేవలం 29 బంతులు ఎదుర్కొని 71 రన్స్ చేశాడు.
చివరి దాకా నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ వేలం పాటలో కనీస ధరకు అమ్ముడు పోయిన ఈ క్రికెటర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ ను ఆడేందుకు ఇష్టపడే రహానే ఇటీవలి కాలం నుంచి రూట్ మార్చాడు. తనదైన శైలికి భిన్నంగా ఆడుతూ విస్తు పోయేలా చేస్తున్నాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బీసీసీఐ రహానే వైపు చూసింది. అంతే కాదు కోహ్లీ వ్యక్తిగత పనుల నిమిత్తం ఇండియాకు వెళ్లి పోవడంతో సారథ్య బాధ్యతలు తీసుకున్న అజింక్యా రహానే భారత జట్టుకు టెస్టు సీరీస్ తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రత్యర్థులు సైతం విస్తు పోయేలా కెప్టెన్సీ నిర్వహించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఆస్ట్రేలియాలో వచ్చే జూన్ 7 నుంచి 15 వరకు జరగనుంది. దీంతో ఆస్ట్రేలియాలో అద్బుతమైన రికార్డు కలిగిన రహానే జట్టులోకి రావడంతో మరింత బలం పెరిగింది.