Nehal Wadhera : ఓడినా ఆక‌ట్టుకున్న వ‌ధేరా

గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న నేహాల్

గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ 55 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగులు చేసింది. అనంత‌రం 208 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ కేవ‌లం 152 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

రోహిత్ శర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ , తిల‌క్ వ‌ర్మ విఫ‌ల‌మైనా అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన యువ ఆట‌గాడు నేహాల్ వ‌ధేరా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్నాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. ఓ వైపు ఆఫ్గాన్ బౌల‌ర్లు నూర్ అహ్మద్, ర‌షీద్ ఖాన్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా ప‌ట్టించు కోలేదు. స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు పెవిలియ‌న్ దారి ప‌డుతున్నా మైదానంలోనే పాతుకు పోయాడు.

గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ధాటిగా ఎదుర్కొంటూ వ‌చ్చిన కామెరాన్ గ్రీన్ 26 బంతులు ఆడి 33 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించాడు. మ‌రోసారి సూర్య కుమార్ యాద‌వ్ నిరాశ ప‌రిచాడు. 12 బంతులు ఎదుర్కొని 23 ర‌న్స్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ లో నేహాల్ వ‌ధేరా ఒక్క‌డే స‌త్తా చాటాడు. 21 బంతులు ఆడి 40 ర‌న్స్ చేశాడు. క్రికెట్ ఫ్యాన్స్ వ‌ధేరా ఆట తీరుకు ఫిదా అయ్యారు.

గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 4 ఓవ‌ర్లు వేసి 27 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే నూర్ అహ్మ‌ద్ 37 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. గుజ‌రాత్ జ‌ట్టులో శుభ్ మ‌న్ గిల్ 34 బంతులు ఆడి 56 ర‌న్స్ చేశాడు. డేవిడ్ మిల్ల‌ర్ 22 బంతులు ఆడి 46 ర‌న్స్ చేశాడు.అభిన‌వ్ మ‌నోహ‌ర్ 21 బంతులు ఎదుర్కొని 42 ర‌న్స్ చేశాడు.

Leave A Reply

Your Email Id will not be published!