Kesavananda Bharati Comment : తీర్పేంటి కేశవానంద కథేంటి
దేశ చరిత్రలో చరిత్రాత్మక తీర్పు
Kesavananda Bharati Comment : ఎవరీ కేశవానంద భారతి అనుకుంటున్నారా. హిందూ సన్యాసి. మఠాధిపతి. కానీ భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా నిలిచి పోయారు. తమ మఠానికి చెందిన భూముల్ని కేరళ ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుందంటూ కేశవానంద భారతి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని, దాని విలువను మరింత పెంపొందించేలా చేసింది. ఈ దేశంలో వెలువరించిన అనేక తీర్పులలో అత్యున్నతమైన తీర్పుగా ఇప్పటికీ నిలిచి ఉంది కేశవానంద భారతి కేసు.
రాజ్యాంగం దేశానికి రక్షణ కవచమని, దానిని ఎవరూ మార్చ లేరని స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎవరికి భంగం కలిగినా సరే సుప్రీంకోర్టులో నేరుగా సవాల్ చేయొచ్చని పేర్కొంది. అంతే కాదు ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరికీ బతికే హక్కు, ప్రశ్నించే హక్కు , ఉపాధి పొందే హక్కు , వాక్ స్వాతంత్రపు హక్కు ఉంటుందని సంచలన తీర్పు చెప్పింది.
రాజ్యాంగంలో సవరణలు చేయొచ్చు, కానీ మార్చే అధికారం ఏ ఒక్కరికీ , ఏ పార్టీకి, ఏ నాయకుడి, ఏ ప్రభుత్వానికి లేదని చరిత్రాత్మకమైన, సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న కేశవానంద భారతిని(Kesavananda Bharati Comment) ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే ఆ తీర్పు వెలువరించి ఏప్రిల్ 24వ తేదీతో 50 ఏళ్లు పూర్తయ్యాయి.
ఇంతకూ కేశవానంద భారతి ఎవరు..ఎందుకు ఆయన కోర్టును ఆశ్రయించారో తెలుసు కోవాలంటే ఈ కథ చదవాల్సిందే. కేశవా నంద భారతి డిసెంబర్ 9, 1940లో పుట్టారు. సెప్టెంబర్ 6, 2020లో కాలం చేశారు. ఆయన భారతీయ హిందూ సన్యాసి. కేరళ లోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న ఎడ్నీర్ మఠానికి శంకరాచార్య (అధిపతి)గా ఉన్నారు.
కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో పిటిషనర్ భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణ సిద్దాంతాన్ని స్థాపించడంలో సహాయ పడిన వ్యక్తిగా పేరు పొందారు.
ఇది ఒక మైలురాయిగా ఇప్పటికీ పేర్కొంటారు. 1970 లో కేశావనంద భారతి(Kesavananda Bharati) 1969లో సవరించిన కేరళ భూ సంస్కరణల చట్టం 1963 ద్వారా మఠం ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు కేరళ సర్కార్ చేసిన ప్రయత్నాలను సవాల్ చేశారు కేశవానంద భారతి సుప్రీంకోర్టులో. ఆయన తరపున ప్రముఖ న్యాయవాది నాని పాల్కివాలా వాదించారు. ప్రాథమిక హక్కు, మత పరమైన వర్గ స్వేచ్ఛ, ఆస్తి హక్కును ప్రస్తావించింది.
ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మార్చి 23, 1973న తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని పార్లమెంట్ మార్చ లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం సంచలనం కలిగించింది. ఈ కేసు భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించింది. 13 మంది న్యాయమూర్తులతో 68 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపింది. ఇది ఓ రికార్డుగా నమోదైంది.
మొత్తంగా ఐదు దశాబ్దాల కిందట మఠం ఆస్తుల విషయంలో కేశవానంద భారతి(Kesavananda Bharati) మఠం ఆస్తుల విషయంలో వేసిన కేసు రాజ్యాంగ మౌలిక స్వరూపం, దాని సంరక్షణ బాధ్యతలపై స్పష్టత వచ్చేందుకు కారణమైంది. ఈ తీర్పు వెలువరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పునకు సంబంధించి రాత ప్రతులతో ఒక ప్రత్యేక వెబ్ పేజ్ ని రూపొందించింది. మొత్తంగా భారత రాజ్యాంగం సుప్రీం..ప్రజాస్వామ్యం అంతిమం అని తేలింది.
Also Read : స్వలింగ వివాహంపై రిజిజు కామెంట్స్