Atharva Taide : అధర్వ తైడే జోర్దార్ ఇన్నింగ్స్
లక్నోకు చుక్కలు చూపిని క్రికెటర్
Atharva Taide : ఐపీఎల్ 16వ సీజన్ లో జరిగిన కీలక లీగ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్(LSG) 56 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 5 వికెట్లు కోల్పోయి 257 రన్స్ చేసింది. అనంతరం 258 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించే ప్రయత్నంలో బోల్తా పడింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.
19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. లక్నో జట్టులో కైల్ మేయర్స్ , మార్కస్ స్టోయినిస్ మారథాన్ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపితే..లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బ్యాటర్ అధర్వ తైడో(Atharva Taide). కేవలం 36 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తైడే 66 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ గౌరవ ప్రదమైన స్కోర్ తో ముగించింది. లేక పోయి ఉంటే భారీ తేడాతో ఓటమి పాలయ్యేది.
ఇదిలా ఉండగా అథర్వ టైడేను గత ఏడాది ఐపీఎల్ వేలం పాటలో పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్ కేవలం రూ. 20 లక్షలకు తీసుకుంది. గత సీజన్ లో ఛాన్స్ లభించినా ఆడలేక పోయాడు. ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ లో భాగంగా ఏప్రిల్ 15న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు అధర్వ టైడే(Atharva Taide). ఈ లీగ్ తొలి హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. టైడే గత సీజన్ లో 7 రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆడాడు. 45.36 సగటుతో 499 పరుగులు చేశాడు. మొహాలీలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అజేయంగా 112 రన్స్ చేశాడు.
అధర్వ టైడే మహారాష్ట్ లోని అకోలా స్వస్థలం. ఏప్రిల్ 26, 2000లో పుట్టాడు. ఎడమ చేతి బ్యాటర్. 2018లో మధ్యప్రదేశ్ తో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్ లో ట్రిపుల్ సెంచరీ చేశాడు.
Also Read : మార్కస్ మారథాన్ ఇన్నింగ్స్