Phil Salt : ఫిల్ సాల్ట్ మెరిసినా తప్పని ఓటమి
ప్లే ఆఫ్ రేసుకు దగ్గరలో హైదరాబాద్
Phil Salt : ఐపీఎల్ లో కోట్లు పెట్టినా కొందరు ఆడడం లేదు. మరికొందరు లక్షల్లో ఖర్చు చేస్తే దుమ్ము రేపుతున్నారు. అలాంటి వారిలో ఓవర్ ఆల్ గా చూస్తే ముంబై క్లాసిక్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన అజింక్యా రహానే. ఈసారి మనోడికి పూనకాలు వచ్చినట్లు ఆడుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో సత్తా చాటుతూ బౌలర్లకు షాక్ ఇస్తున్నాడు.
సేమ్ సీన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిపీట్ అవుతోంది. ఫిల్ సాల్ట్(Phil Salt) తనదైన శైలిలో బ్యాటింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకునేలా చేస్తోంది. చూడ చక్కని షాట్స్ ఆడడంలో తనకు తనే సాటి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన కీలక మ్యాచ్ లో అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు కోల్పోయినా మరో స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ దుమ్ము రేపాడు.
ఆల్ రౌండ్ షో ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 39 బంతులు ఎదుర్కొని 63 రన్స్ చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మార్ష్ తో కలిసి జట్టును గెలుపు అంచుల దాకా తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించాడు ఫిల్ సాల్ట్. 53 విలువైన పరుగులు చేశాడు.
అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కిప్పర్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 197 రన్స్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లు కోల్పోయి 188 రన్స్ కే పరిమితమైంది.
Also Read : మరోసారి మెరిసిన శుభ్ మన్ గిల్