Byju CEO Ravindran : బైజు ఉద్యోగులకు చీఫ్ భరోసా
చట్టాలను పూర్తిగా పాటించండి
Byju CEO Ravindran : భారత దేశంలో అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా పేరు పొందింది బైజు. ఇది విద్యా రంగానికి సంబంధించి కంటెంట్ ను తయారు చేస్తుంది. స్థాపించిన కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున ఆదరణ చూరగొంది. కోట్లాది రూపాయలను ఆర్జించింది. కాగా లెక్కల్లో , ఆర్థిక లావాదేవీలలో తేడాలు ఉన్నాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) రంగంలోకి దిగింది. బెంగలూరులోని బైజు ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టారు. విలువైన పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు.
దాడుల అనంతరం బైజు సిఇఓ, చైర్మన్ రవీంద్రన్(Byju CEO Ravindran) కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలను పూర్తిగా పాటించాలని , ఏ ఒక్కరు దానికి అతీతులు కారని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎప్పటి లాగే తమ పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు. వారాంతపు దాడి అనంతరం జాబర్స్ , భాగస్వామ్యులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేశారు రవీంద్రన్. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఈ విచారణ జరుగుతోందని తెలిపింది కంపెనీ బైజు.
ఈ మేరకు బైజు సిఇఓ(Byju CEO Ravindran) స్వతహాగా లేఖలు రాశారు ఉద్యోగులకు. 22 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ లిక్విడిటీ క్రంచ్ ను పరిష్కరించేందుకు నిధులను సేకరించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్న సమయంలో ఈడీ దాడులు చేసిందని తెలిపారు. అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు బైజు సిఇఓ రవీంద్రన్.
Also Read : తలైవాపై విమర్శలు తగదు