Vinesh Phogat Thakur : అనురాగ్ ఠాకూర్ పై ఫోగట్ ఫైర్
మహిళా రెజ్లర్ షాకింగ్ కామెంట్స్
Vinesh Phogat Thakur : కేంద్ర క్రీడా, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై నిప్పులు చెరిగారు మహిళా రెజ్లర్లు. ఆయన రాజకీయం చేస్తున్నారని, తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న డబ్ల్యుఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వినేష్ ఫోగట్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్ ఫోగట్ మీడియాతో మాట్లాడారు.
సమస్య తీవ్రతను తగ్గించేందుకు తుతూ మంత్రంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. ఆ కమిటీ పూర్తిగా సింగ్ కు అనుకూలంగా ఉండేలా చేసిందని మండిపడ్డారు. తాము గతంలో పలుమార్లు క్రీడా శాఖకు, ఉన్నతాధికారికి, చివరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఠాకూర్ కు కూడా గోడు వెళ్ల బోసుకున్నామని కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వినేష్ ఫోగట్(Vinesh Phogat ).
ఇంత కాలం తన అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమైన విషయమని పేర్కొన్నారు. ఇవాళ తాము రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టినా కిమ్మనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తికి సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దేశంలో మహిళలకు, ప్రధానంగా క్రీడాకారిణులకు రక్షణ కరువైందని ఇక దేశం పరువు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు వినేష్ ఫోగట్(Vinesh Phogat).
Also Read : దమ్ముంటే నన్ను నిషేధించండి