Phil Salt : శివమెత్తిన సాల్ట్ బెంగళూరుకు షాక్
బెంగళూరుకు బిగ్ ఝలక్
Phil Salt : ఐపీఎల్ లో ఇతర జట్లకు ఝలక్ ఇస్తూ వచ్చిన రాయల్ ఛాలెంజర్ బెంగళూరుకు చుక్కలు చూపించాడు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్. టి20 ఫార్మాట్ లో ఆర్సీబీ బౌలర్లకు ఝలక్ ఇచ్చాడు. అద్భుతమైన ఆట తీరుతో దుమ్ము రేపాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 181 రన్స్ చేసింది.
అనంతరం భారీ స్కోర్ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ ఆటగాళ్లు ఎవరూ ఊహించ లేదు ఢిల్లీ బ్యాటర్లు శివమెత్తారు. ప్రధానంగా ఒకే ఒక్కడు ఫిలిప్ సాల్ట్(Phil Salt) అన్నీ తానై గెలిపించాడు. 187 పరుగులు చేస్తే అందులో ఒక్కడే ఫిలిప్ 87 రన్స్ చేశాడు. ఆఖరులో పెవిలియన్ దారి పట్టాడు. సాల్ట్ మైదానంలో ఉన్నంత వరకు బెంగళూరు ఆటగాళ్లు చూస్తూ ఉండి పోయారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేక పోయారు.
కళ్లు చెదిరే షాట్స్ తో షాక్ ఇచ్చాడు ఫిలిప్ సాల్ట్. ఫోర్లు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. సుడిగాలి ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. సహచర ఆటగాడు రిలే రస్సో తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రస్సో 35 రన్స్ చేశాడు. అంతకు ముందు వార్నర్ సైతం దంచి కొట్టాడు. 22 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 26 రన్స్ తో ఆకట్టుకున్నాడు.
Also Read : అబ్బా ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బ