Chhattisgarh Liquor Case : లిక్కర్ స్కాంలో 2 వేల కోట్ల అవినీతి
స్పష్టం చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
Chhattisgarh Liquor Case : చత్తీస్ గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బయట పడింది(Chhattisgarh Liquor Case). ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2,000 కోట్ల అవినీతి వెలుగలోకి వచ్చిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్ పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్ ని ఈడీ అదుపులోకి తీసుకుంది.
మనీ లాండరింగ్ కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల మద్దతుతో నడుస్తోందని పేర్కొంది ఈడీ. 2019 , 2022 మధ్య కాలంలో భారీ అవినీతి చోటు చేసుకుందని తెలిపింది.
ఇదిలా ఉండగా రాయ్ పూర్ లోని ఒక హోటల్ లో ఉన్న అన్వర్ ధేబర్ ను తాము వస్తున్నామని తెలిసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడని అతడిని వల పన్ని పట్టుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, ఉన్నత అధికారుల మద్దతుతో మద్యం స్కాంకు పాల్పడినట్లు కుండ బద్దలు కొట్టింది.
ఈ కేసులో ముందుగా మార్చిలో దాడులు చేపట్టింది ఈడీ. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దర్యాప్తు మే,2022లో ఐటీ ఛార్జ్ షీట్ ఆధారంగా కేసు నమోదు చేసింది. రాష్ట్ర చట్టం ప్రకారం ప్రైవేట్ దుకాణాలకు పర్మిషన్ లేదు. మొత్తం 800 దుకాణాలను సర్కార్ నడుపుతోంది.
Also Read : రుజువు చేస్తే ఉరి వేసుకుంటా