The Kerala Story : ది కేరళ స్టోరీ వసూళ్ల సునామీ
రూ. 20 కోట్లకు పైగా వసూలు
The Kerala Story : వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రం ఊహించని రీతిలో కోట్లు వసూలు చేస్తోంది. ఇది ఊహించని సక్సెస్. ఎంత సినిమా వివాదం రేగితే అంత ప్రచారం జరుగుతుందని ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తున్నారు. మరో వైపు సినిమాకు ప్రత్యక్షంగా ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం , కొన్ని రాష్ట్రాలు పన్ను వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.
కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చేసింది. ఇప్పటి దాకా రూ. 11.22 కోట్లు రాబట్టింది. 39.73 శాతం వృద్దిని కనబరిచింది. ది కేరళ స్టోరీ చిత్రాన్ని మే5న థియేటర్లలోకి వచ్చింది. మొత్తం వసూళ్లు రూ. 20 కోట్లు సాధించడం మూవీ మేకర్స్ ను సంతోషానికి లోను చేస్తోంది. కేరళ రాష్ట్రంలో ముస్లిం మహిళలు 32,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని , ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరారని ఇందులో ప్రస్తావించారు. చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
కేరళ కథ(The Kerala Story) చర్చనీయాంశంగా మారింది. సినిమా ట్రైలర్ లో కేరళకు చెందిన ముగ్గురు మహిళల కథ మాత్రమేనని పేర్కొంది. ఆదివారం ట్విట్టర్ లో చిత్ర విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేశారు. కేరళ స్టోరీ సంచలనాత్మకంగా మారింది. డబుల్ డిజిట్ లను తాకింది. శుక్రవారం రూ. 8.03 కోట్లు, శనివారం రూ. 11.22 కోట్లు, మొత్తం ఇండియా వ్యాప్తంగా రూ. 19.23 కోట్లకు చేరిందని వెల్లడించారు.
Also Read : లిక్కర్ స్కాంలో 2 వేల కోట్ల అవినీతి